28, ఆగస్టు 2011, ఆదివారం

నేనూ వెళ్ళాను    

తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని e-తెలుగు వారి ప్రోద్బలంతో జరిగిన 'తెలుగు బాట' కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషాభిమానులు తెలుగు లలిత కళాతోరణం నుండి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వరకు తెలుగు కోసం నడిచారు. అనంతరం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సభా వేదికలో ప్రసంగం జరిగింది. తదనంతరం అదే ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూల మాలలు వేయడంతో కార్యక్రమం ముగిసింది.

అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం తెలుగు బాటకి హాజరయ్యాను. కార్యక్రమం చాలా బాగా జరిగింది. కొంతమంది (ఇంత వరకు పేర్లు మాత్రమే తెలిసిన) బ్లాగు మిత్రులను, తెలుగు భాషాభిమానులను కలిశాను.

ఫోటోలు కూడా తీశాను... :)


జై తెలుగు తల్లి! జై జై తెలుగు తల్లి!!

26, ఆగస్టు 2011, శుక్రవారం

నేను ఎగ్గొట్టట్లేదు...


పోయిన సంవత్సరం ఇలాగే రాసినట్టు జ్ఞాపకం... కానీ ఏవో కారణాల వల్ల వెళ్ళడం కుదరలేదు. ఈ కార్యక్రమం జరిగిన మరునాడు 'నేను ఎగ్గొట్టాను...' అని కూడా రాద్దాం అనుకున్నాను కూడా. అందుకే ఈ సారి దాని వ్యతిరేక పదం టపా శీర్షిక అయింది.

కానీ ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. వెళ్తున్నాను కూడా. అందరికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏడాది తెలుగు బాట కార్యక్రమం తెలుగు భాషా దినోత్సవానికి ఒకరోజు ముందుగా ఆదివారం నాడు నిర్వహించాలని నిర్ణయించారట. కాబట్టి చాలా మంది పాల్గొనే అవకాశం ఉంది.
ఇక తెలుగు భాష విశిష్టత, దానిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మన మీద ఎంత ఉంది అనేవి మనందరికీ తెలిసినవే.

ఆదివారం సెలవు దినమే కాబట్టి... ఆఫీసులు ఉండవు కాబట్టి... కొంచం ఓపిక తెచ్చుకొని పొద్దున్నే లేచి వచ్చి తెలుగు నడకలో పాల్గొని తెలుగు తల్లి కృపకు పాత్రులు కాగలరని ప్రార్ధన.

తేది: 28-08-2011
సమయం: 9 గంటల నుండి
స్థలం: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు

కాబట్టి కామ్రేడ్స్ తెలుగు వారందరం తెలుగు కోసం నడుద్దాం!  


జై తెలుగు తల్లి! జైజై తెలుగు తల్లి!